Trending Posts

ఇస్రో షాటిలైట్ సెంటర్‌లో 410 అప్రెంటిస్ పోస్టులు: ఆగస్టు 28 ఆఖరి తేదీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కి చెందిన బెంగళూరులోని యు.ఆర్. రావు షాటిలైట్ సెంటర్ (URSC) 2026-27 సంవత్సరానికి గానూ 410 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
​ఖాళీల వివరాలు:
​గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బీఈ/బీటెక్): 220
​టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): 120
​కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్: 70
​విభాగాల వారీగా:
కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఆటోమోబైల్, ఏరోనాటికల్ మొదలైన ఇంజినీరింగ్ మరియు డిప్లొమా విభాగాలు.
​అర్హత & వేతనం:
సంబంధిత విభాగాల్లో 2022 నుండి 2026 మధ్య బీఈ/బీటెక్ లేదా డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులు (2021 కంటే ముందు ఉత్తీర్ణులైనవారు అనర్హులు).
నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.12,300, టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.10,900 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.
​ఎంపిక & దరఖాస్తు విధానం:
అభ్యర్థులను మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్‌లో నమోదు చేసుకుని, అనంతరం UMANG యాప్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
​ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.07.2026
​చివరి తేదీ: 28.08.2026

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/