ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లలో 2026–27 సంవత్సరానికి గాను 1,599 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రధాన వివరాలు:
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, వైర్‌మన్, ఏసీ మెకానిక్, కోపా (COPA), ల్యాబోరేటరీ టెక్నీషియన్ తదితరాలు.
అర్హత: కనీసం 50% మార్కులతో 10వ తరగతి (మెట్రిక్యులేషన్) / ఇంటర్తో పాటు సంబంధిత ట్రేడులో ITI ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2026 సెప్టెంబరు 15 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. (SC/STలకు 5 ఏళ్లు, OBCకి 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపకల్పన.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.100. (SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది).
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2026 ఆగస్టు 26
చివరి తేదీ: 2026 సెప్టెంబరు 15.
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1,599 అప్రెంటిస్ పోస్టులు







