ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గోరఖ్‌పూర్ (AIIMS Gorakhpur) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రధాన వివరాలు:
మొత్తం ఖాళీలు: సీనియర్ రెసిడెంట్ – 42
విభాగాలు: అనాస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆప్తాల్మాలజీ, పల్మోనరీ మెడిసిన్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో MD / MS / DNB ఉత్తీర్ణతతో పాటు స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ. 67,700.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 08.
ఇంటర్వ్యూ తేదీలు: 2026 సెప్టెంబరు 9, 10 వరకు.
ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు







