మధ్యప్రదేశ్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) – మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, ఇండోర్ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు (మొత్తం ఖాళీలు: 80):
ప్రొఫెసర్: 12
అసోసియేట్ ప్రొఫెసర్: 32
అసిస్టెంట్ ప్రొఫెసర్: 11
సీనియర్ రెసిడెంట్: 25
ముఖ్య వివరాలు:
అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వేతనం: ప్రొఫెసర్‌కు ₹1,23,100; అసోసియేట్ ప్రొఫెసర్‌కు ₹78,800; అసిస్టెంట్ ప్రొఫెసర్ & సీనియర్ రెసిడెంట్‌కు ₹67,700 నెలకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అర్హులైన అభ్యర్థులు 2026 సెప్టెంబరు 15 వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈఎస్ఐసీ ఇండోర్‌లో ఫ్యాకల్టీ ఖాళీలు










