దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Schedule-II, July-2026) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల నియామకాలు చేపడతారు.
ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి ప్రారంభ వేతనం నెలకు రూ. 10,000 నుండి రూ. 12,000 వరకు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 21వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
టెన్త్ అర్హతతో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు: సెప్టెంబరు 21 చివరి తేదీ







