కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కీలక అప్డేట్ ఇచ్చింది. SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామినేషన్ 2026కు సంబంధించిన పరీక్ష తేదీలను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీగా ఉన్న మొత్తం 12,256 గ్రూప్-బీ, గ్రూప్-సీ (అసిస్టెంట్, ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం SSC CGL Tier-1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBE) సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 30, 2026 వరకు జరగనుంది. ఎంపిక ప్రక్రియను Tier-I, Tier-II పరీక్షలు మరియు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆధారంగా నిర్వహిస్తారు. పరీక్ష మార్గదర్శకాలు, అడ్మిట్ కార్డ్ వివరాల కోసం SSC అధికారిక వెబ్సైట్ను చూడగలరు.
SSC CGL 2026: 12,256 ఉద్యోగాల పరీక్ష షెడ్యూల్ విడుదల







