Trending Posts

విజయనగరం జిల్లా బొబ్బిలిలో భారీ ఉద్యోగ మేళా. 1300+ ఖాళీల భర్తీ!

​విజయనగరం జిల్లా బొబ్బిలిలోని రాజా ఆర్.ఎస్.ఆర్.కె. రంగారావు కళాశాల (RTC కాంప్లెక్స్ సమీపంలో) వేదికగా సెప్టెంబర్ 21వ తేదీన భారీ ఉద్యోగ మేళా (జాబ్ డ్రైవ్) నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 18కి పైగా ప్రముఖ కంపెనీల్లో 1,300 కంటే ఎక్కువ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగ మేళాలో టెక్ మహీంద్రా, విప్రో, కన్‌సెంట్రిక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, అపోలో ఫార్మసీ, దివిస్ ల్యాబోరేటరీస్, హెటెరో ల్యాబ్స్, డి-మార్ట్, ఫ్లిప్‌కార్ట్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, అరబిందో ఫార్మా, డెక్కన్ ఫైన్ కెమికల్స్ మరియు స్నైడర్ ఎలక్ట్రిక్ వంటి పలు అగ్రగామి సంస్థలు పాల్గొంటున్నాయి.
ఎంపికైన అభ్యర్థులకు విధులను బట్టి నెలవారీ వేతనం రూ. 13,000 నుండి రూ. 50,000 వరకు ఉంటుంది. వేతనంతో పాటు అలవెన్సులు, CTC, ఆహారం, వసతి మరియు ప్రయాణ సదుపాయాలు వంటి అదనపు ప్రయోజనాలను కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి.
​తేదీ: 21 సెప్టెంబర్ 2026
​వేదిక: రాజా RSRK రంగారావు కాలేజ్, RTC కాంప్లెక్స్ సమీపంలో, బొబ్బిలి, విజయనగరం జిల్లా
​సంప్రదించాల్సిన నంబర్లు: 7989826953, 7995691295, 9618792572, 8099461303
​అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ విద్యార్హతల పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/