నెహ్రూ సిద్ధాంత్ కేంద్ర ట్రస్ట్ (Nehru Sidhant Kender Trust) ఆధ్వర్యంలో ‘సత్య స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026’ ప్రకటించబడింది. మెడికల్, హెల్త్ సైన్సెస్ కోర్సులు చదివే అర్హులైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. MBBS, BDS, BPT, B.Sc. నర్సింగ్, B.Sc. అలైడ్ & హెల్త్‌కేర్ వంటి 3 నుంచి 5 సంవత్సరాల కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు.
పంజాబ్‌లోని గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతిలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
పంజాబ్ విద్యార్థులు లుధియానాలోని 12 ఎంపిక చేసిన సంస్థల్లో లేదా లుధియానా విద్యార్థులు దేశవ్యాప్తంగా టాప్ NIRF ర్యాంక్ మెడికల్ సంస్థల్లో ప్రవేశం పొంది ఉండాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ఇప్పటికే వేరే స్కాలర్షిప్ పొందుతున్నవారు దీనికి అనర్హులు. బాలికలు, క్రీడాకారులు, దివ్యాంగులు (PwD), అనాథలు, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
లభించే ప్రయోజనాలు & దరఖాస్తు:
ఎంపికైన విద్యార్థులకు కోర్సు వ్యవధిలో ఏటా 100% ఫీజుతో పాటు హాస్టల్ వసతి, భోజన సదుపాయం కూడా లభిస్తుంది. ఆసక్తి గల భారతీయ పౌరులు www.b4s.in/yeks/SAT4 వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో 31 అక్టోబర్ 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సత్య స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 మెడికల్ విద్యార్థులకు 100% ఫీజు, హాస్టల్, భోజన సదుపాయం










