సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కోటా 2026 కింద హెడ్ కానిస్టేబుల్ (GD), కానిస్టేబుల్ (GD) గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు: 521
హెడ్ కానిస్టేబుల్ (జీడీ): 182 (పురుషులు: 150, మహిళలు: 32)
కానిస్టేబుల్ (జీడీ): 339 (పురుషులు: 258, మహిళలు: 81)
అర్హతలు & వయోపరిమితి:
హెడ్ కానిస్టేబుల్: 10+2 (ఇంటర్) ఉత్తీర్ణతతో పాటు జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం లేదా 1-3 స్థానాలు సాధించి ఉండాలి.
కానిస్టేబుల్: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉండాలి.
వయస్సు: 01/08/2026 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది).
జీతం & ఎంపిక:
హెడ్ కానిస్టేబుల్కు రూ. 25,500 – రూ. 81,100, కానిస్టేబుల్కు రూ. 21,700 – రూ. 69,100 వేతనం లభిస్తుంది. ఫిజికల్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 12 నుంచి నవంబరు 11, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ. 100 (మహిళలు, SC, ST, మాజీ సైనికులకు మినహాయింపు ఉంటుంది
సీఆర్పీఎఫ్లో 521 స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు










