ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక స్కూల్ టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న టీజీటీ మ్యాథ్స్ (Trained Graduate Teacher – Mathematics) పోస్టు భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుకు సంబంధించి 1 ఖాళీ అందుబాటులో ఉంది. విద్యార్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బి.ఈడి (B.Ed) లేదా ఎం.ఈడి (M.Ed) ఉత్తీర్ణతతో పాటు బోధనా రంగంలో అనుభవం ఉన్నవారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గరిష్టంగా రూ. 44,900 వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ‘The Principal, Sainik School Korukonda, PO: Sainik School Korukonda, Vizianagaram District, Andhra Pradesh – 535214’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 02-10-2026. మరింత సమాచారం కోసం https://www.sainikschoolkorukonda.org వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
కోరుకొండ సైనిక స్కూల్‌లో టీచర్ ఉద్యోగం నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక










