ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భర్తీ చేయనున్న 73 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్-II) పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబరు 9వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ 2026 అక్టోబరు 29గా నిర్ణయించారు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు ఎదురవకుండా అభ్యర్థులు ముందుగానే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ పోస్టుల దరఖాస్తు తేదీలు ఖరారు










