Trending Posts

అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లాలో మొత్తం 264 ఖాళీలు..

వికారాబాద్ జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 102 అంగన్వాడీ టీచర్లు, 162 అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. కొడంగల్ పరిధిలో అంగన్వాడి టీచర్లు 13, ఆయాలు 31, మర్పల్లి పరిధిలో అంగన్వాడి టీచర్లు 21, ఆయాలు 14, పరిగి పరిధిలో అంగన్వాడి టీచర్లు 27, ఆయాలు 78, తాండూర్ పరిధిలో అంగన్వాడి టీచర్లు 23, ఆయాలు 28, వికారాబాద్ పరిధిలో అంగన్వాడి టీచర్లు 18, ఆయాలు 11 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, స్థానికత, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, ఇతర నిబంధనల పూర్తి వివరాలను http://wdcw.tg.nic.in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఆయా అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో కార్యాలయ పనివేళల్లో దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాల గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన జిరాక్స్ ప్రతులను సమర్పించాలి. ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రద్దు చేయడం, సవరించడం లేదా మార్పులు చేయడం వంటి అధికారాలు జిల్లా కలెక్టర్, చైర్మన్‌కు ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారులను సంప్రదించాలని సూచించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/