భారతదేశంలోనే అగ్రగామి టైర్ తయారీ సంస్థ అయిన MRF (Madras Rubber Factory) తెలంగాణ, తమిళనాడులోని తమ తయారీ కేంద్రాల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ సంస్థ ఇంజినీర్, సూపర్వైజర్ (మెయింటెనెన్స్, ప్రొడక్షన్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్లాంట్ టెక్నికల్) మరియు అసిస్టెంట్ (షిప్పింగ్/స్టోర్స్) పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
తేదీ & సమయం: సెప్టెంబర్ 19, 2026, ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు.
విద్యార్హత: B.E / B.Tech / M.Sc / B.Sc / డిప్లొమా / B.Com / M.Com / BBA / BCA పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో 2 నుండి 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. షిఫ్ట్ విధానంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతంతో పాటు రవాణా, క్యాంటీన్, మెడికల్ మరియు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వసతులు కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు తమ తాజా రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సర్టిఫికెట్లు, అనుభవ ధ్రువపత్రాలు, జీతం స్లిప్పులు, ఆధార్ మరియు పాన్ కార్డ్‌లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
వేదిక: VNR విజ్ఞాన జ్యోతి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, విజ్ఞాన జ్యోతి నగర్, బాచుపల్లి, హైదరాబాద్ – 500118.







