చండీగఢ్‌లోని ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్’ (PGIMER) భారీ సంఖ్యలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 243 ఖాళీలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి నేడే (అక్టోబర్ 3, 2026) చివరి అవకాశం.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి. నర్సింగ్ (ఆనర్స్), పోస్ట్-బేసిక్ బి.ఎస్.సి. లేదా GNM డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సుగా మరియు మిడ్‌వైఫ్‌గా నమోదు చేసుకోవాలి. GNM అభ్యర్థులకు కనీసం 50 పడకల ఆసుపత్రిలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయస్సు 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), షార్ట్‌లిస్టింగ్, మరియు పత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ.1,500 కాగా, SC, ST అభ్యర్థులకు రూ.800గా నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.pgimer.edu.in ద్వారా వెంటనే అప్లై చేసుకోవచ్చు.
PGIMERలో 243 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ!







