కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ (షిల్లాంగ్) గ్రూప్-సి టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్ కేటగిరీలో 354 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వారెంట్ ఆఫీసర్ (129), రైఫిల్‌మ్యాన్ (219), హవల్దార్ (6) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 10వ తరగతి, ఇంటర్మీడియట్లతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ పరీక్షలు మరియు మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (www.assamrifles.gov.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ 2026 అక్టోబర్ 28. రిక్రూట్మెంట్ ర్యాలీలు 2026 నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి.
అస్సాం రైఫిల్స్‌లో 354 గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్







