ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) కింద పనిచేస్తున్న ‘ఆయిల్ ఇండియా హయ్యర్ సెకండరీ స్కూల్’ (OIHSS)లో తాత్కాలిక ప్రాతిపదికన గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకాగా, సెప్టెంబరు 7న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
పోస్టులు, వివరాలు:
మొత్తం ఖాళీలు: 02 (గ్రాడ్యుయేట్ టీచర్)
విభాగాలు: ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్
అర్హత: సంబంధిత విభాగాల్లో కనీసం 50% మార్కులతో డిగ్రీ (బ్యాచిలర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్/ఫిజికల్ ఎడ్యుకేషన్) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 21,450 తో పాటు ప్రతి పనిదినానికి రూ. 825 వేరియబుల్ ఎమోల్యుమెంట్ అందిస్తారు.
ఎంపిక విధానం & ఇంటర్వ్యూ వివరాలు:
అభ్యర్థులను వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 2026 సెప్టెంబర్ 07
అడ్రస్: దులియాజాన్ క్లబ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, దులియాజాన్.
ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
ఆయిల్ ఇండియాలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్







