Trending Posts

ఎన్‌ఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టుల భర్తీ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దిల్లీ (NIT) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
​పోస్టుల వివరాలు మొత్తం ఖాళీలు: 08
​ప్రాజెక్ట్ అసోసియేట్ (సివిల్) – 03
​ప్రాజెక్ట్ అసోసియేట్ (ఎలక్ట్రికల్) – 01
​జూనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ – 01
​ప్రాజెక్ట్ అటెండెంట్ – 02
​ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (సివిల్) – 01
​​అర్హతలు పోస్టును అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, బీటెక్ లేదా ఎమ్‌టెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
​వయస్సు గరిష్ఠంగా 65 ఏళ్లు మించకూడదు.
​ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కి రూ. 55,000; ప్రాజెక్ట్ అసోసియేట్‌కి రూ. 37,000; జూనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ & ప్రాజెక్ట్ అటెండెంట్‌లకు రూ. 32,800 జీతం చెల్లిస్తారు.
​వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
​దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా ajay@nitdelhi.ac.in కు దరఖాస్తులు పంపాలి.
​వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 03, 2026 న ఉంటుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/