Trending Posts

ఇగ్నోలో డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు పెంపు

​ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జులై 2026 సెషన్‌కు సంబంధించి దూరవిద్య ద్వారా అందించే డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును పెంచింది. ఆసక్తి గల విద్యార్థులు అక్టోబర్ 15, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.
​బ్యాచిలర్ డిగ్రీలు: బిఏ, బిశామ్, బిసిఏ, బిబిఏ, బిఎస్సీ, బిఎస్డబ్ల్యూ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
​పోస్ట్ గ్రాడ్యుయేషన్: ఎంబీఏ, ఎంఏ, ఎంసీఏ, ఎంకామ్ తదితర ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.
అభ్యర్థులు ignouadmission.samarth.edu.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థులు తమ అపార్ ఐడీ (APAAR ID)ని సిద్ధంగా ఉంచుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లించిన తర్వాత ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/