యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-‘ఎ’, గ్రూప్-‘బి’ పోస్టుల భర్తీకి ప్రతిష్టాత్మక ‘ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE 2027)’ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఇందులో 19 పోస్టులు దివ్యాంగులకు (PwBD) కేటాయించారు.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మరియు ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో బి.ఇ/బి.టెక్ (B.E/B.Tech) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జనవరి 1, 2027 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).
ప్రిలిమినరీ పరీక్ష (31 జనవరి 2027)
మెయిన్ పరీక్ష (18 జూన్ 2027)
పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://upsconline.nic.in ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసుకుని అక్టోబర్ 06, 2026 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ 480 ఖాళీలతో UPSC ESE 2027 నోటిఫికేషన్







