కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఎస్ఆర్ (CSR) ప్రాజెక్టులో భాగంగా విద్యార్థినుల ఉన్నత చదువులకు మద్దతుగా ‘కోటక్ కన్యా స్కాలర్షిప్-2026’ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
స్కాలర్షిప్ వివరాలు:
మొత్తం: ఏటా రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం.
ప్రయోజనం: కాలేజీ ఫీజు, ఇంటర్నెట్, రవాణా, ల్యాప్‌టాప్, బుక్స్, స్టేషనరీ ఖర్చులకు ఉపయోగించవచ్చు.
అర్హతలు:
ఇంటర్ పూర్తి చేసి 2026-27 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, డిజైన్, ఎల్ఎల్బీ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరిన విద్యార్థినులు అర్హులు.
ఇంటర్లో కనీసం 75 శాతం మార్కులు లేదా సమానమైన సీజీపీఏ సాధించాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
ఇంటర్ తర్వాత గరిష్ఠంగా ఒక సంవత్సరం గ్యాప్ వరకు మాత్రమే అనుమతిస్తారు.
ఎంపిక & దరఖాస్తు విధానం:
అకడమిక్ మెరిట్, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల ఇంటర్వ్యూల ద్వారా ర్యాంకులు కేటాయించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి స్కాలర్షిప్ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
దరఖాస్తు విధానం: అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి.
చివరి తేదీ: 2026 అక్టోబరు 15 వరకు చేసుకోవచ్చు
కోటక్ మహీంద్రా బ్యాంక్ స్కాలర్షిప్ 2026 ప్రకటన: చివరి తేదీ అక్టోబరు 15










