ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రెగ్యులర్ ప్రాతిపదికన 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫైర్ సర్వీసెస్, కార్పొరేట్ ప్లానింగ్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, బీఈ/బీటెక్, ఎంబీఏ లేదా ఎంసీఏ చదివి, పని అనుభవం ఉన్నవారు అర్హులు. 2026 సెప్టెంబర్ 7 నాటికి మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 389 మేనేజర్ ఖాళీలు









