Trending Posts

ఎస్బీఐలో 1,538 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా SC, ST, OBC కేటగిరీల కోసం 1,538 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో 32, ఆంధ్రప్రదేశ్‌లో 88 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు & వయోపరిమితి:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 01.04.2026 నాటికి వయస్సు 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి (SC, STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది).
ఎంపిక & వేతనం:
ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు మరియు స్థానిక భాషా పరీక్ష (LPT) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలవారీ వేతనం రూ.26,730 నుండి రూ.46,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు 2026 ఆగస్టు 7 నుండి ఆగస్టు 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు OBCలకు రూ.750, SC/ST/PwBD అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/