దేశంలోని ఐఐటీలతో సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎం.టెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2027) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తోంది. గుర్తింపు పొందిన ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్ డిగ్రీలో మూడో సంవత్సరం చదువుతున్న లేదా ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి అర్హులు. ఈసారి కొత్తగా ‘రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ పేపర్‌ను చేర్చారు. దీంతో మొత్తం పేపర్ల సంఖ్య 30గా ఉంది. గేట్ స్కోర్‌ను ఐఐటీ ప్రవేశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (PSUs) ఉద్యోగాల భర్తీకి కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ స్కోర్ ఫలితాల ప్రకటన తేదీ నుండి 3 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. అప్లికేషన్ విధానం ఆన్‌లైన్‌లో ఒకే దరఖాస్తు ద్వారా ఒకటి లేదా రెండు పేపర్లు ఎంచుకోవచ్చు. దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 1000; ఇతరులకు రూ. 2000.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 27, 2026 నుంచి ప్రారంభం అయ్యాయి. చివరి తేదీ అక్టోబర్ 5, 2026 (ఈ రోజు), (ఆలస్య రుసుముతో అక్టోబర్ 12 వరకు).
పరీక్ష తేదీలు ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీలలో రోజుకు రెండు సెషన్లలో (ఉదయం 9:30-12:30, మధ్యాహ్నం 2:30-5:30) కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో 3 గంటల పాటు జరుగుతుంది. ఇందులో 65 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.
గేట్ 2027 నోటిఫికేషన్ విడుదల ఐఐటీ మద్రాస్ ద్వారా నిర్వహణ నేడే చివరి తేది !







