దేశవ్యాప్తంగా ఉన్న 25 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలలో (NLUs) అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) లా ప్రోగ్రామ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే ‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027’ నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ మరియు ఏడాది ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఐయు, హైదరాబాద్లోని నల్సార్, భోపాల్, కోల్కతా తదితర ప్రాంతాల్లోని 25 ప్రముఖ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఈ ప్రవేశ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. యూజీ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో 10+2 (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్ఎల్బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం ఆగస్టు 3, 2026.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబరు 31, 2026.
క్లాట్-2027 పరీక్ష తేదీ (ఆఫ్లైన్): డిసెంబర్ 6, 2026న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీలోగా అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)-2027 నోటిఫికేషన్ విడుదల







