జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUH), హైదరాబాద్ పరిధిలోని కళాశాలల్లో ఎంటేక్, ఎంఫార్మసీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల ప్రకటన విడుదలైంది. TG PGECET 2026 ద్వారా ఈ ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్ ‘డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్’ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. విద్యార్థులు కౌన్సెలింగ్ సమయానికి ఒరిజినల్ సర్టిఫికేట్లు, నిర్దేశించిన ఫీజును వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. కుకట్‌పల్లి, సుల్తాన్‌పూర్, జగిత్యాల ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు సుల్తాన్‌పూర్ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో ఈ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.
జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటేక్, ఎంఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు







