తెలంగాణ ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ 2026-2027 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ రెండో దశ ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), 63 ప్రభుత్వ ఐటీఐలు, 230 ప్రైవేట్ ఐటీఐలలో మొత్తం 47 రకాల ట్రేడుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రకటన జారీ చేశారు. మొదటి దశలో చేరిన వారు కూడా మెరుగైన సీటు కోసం స్లైడింగ్ ద్వారా కొత్త ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
ఎస్.సి (10వ తరగతి) లేదా సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ట్రేడ్లకు 8వ తరగతి అర్హత కూడా సరిపోతుంది. 1 ఆగస్టు 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 14 ఏళ్లు (డ్రోన్ టెక్నాలజీకి 16 ఏళ్లు) నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు & వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 6 నుండి 15 వరకు
ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన: ఆగస్టు 8 నుండి 17 వరకు
సీట్ల కేటాయింపు: ఆగస్టు 20 నుంచి
రిపోర్టింగ్/జాయినింగ్: ఆగస్టు 21 నుండి 24 వరకు
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (iti.telangana.gov.in) ద్వారా సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఐటీఐ 2వ దశ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల







