తెలంగాణలోని డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు లెక్చరర్లుగా అర్హత సాధించడానికి నిర్వహించే TG SET – 2026 పరీక్ష ప్రకటన విడుదల అయింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50% మార్కులు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
టీజీ సెట్ రాసేందుకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీకి రూ.2,000; బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి రూ.1,500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్లకు రూ.1,000 ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రెండు పేపర్లుగా 3 గంటల వ్యవధిలో ఒకే సెషన్‌లో పరీక్ష విధానం ఉంటుంది. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులకు 40%, రిజర్వ్‌డ్ వర్గాలకి 35% మార్కులు రావాలి.
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ: 30-08-2026.
రూ.1,500 ఆలస్య రుసుముతో: 31-08-2026 నుండి 05-09-2026 వరకు చేసుకోవచ్చు.
రూ.2,000 ఆలస్య రుసుముతో: 06-09-2026 నుండి 10-09-2026 వరకు చేసుకోవచ్చు.
రూ.3,000 ఆలస్య రుసుముతో: 11-09-2026 నుండి 12-09-2026 వరకు చేసుకోవచ్చు.
దరఖాస్తుల సవరణ (ఎడిట్ ఆప్షన్): 13-09-2026 నుండి 15-09-2026 వరకు ఉంటుంది. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ 24-09-2026 నుండి చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు: 28-09-2026 నుండి 30-09-2026 వరకు.
పరీక్ష కేంద్రాలు:
ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి ప్రాంతీయ కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. పూర్తి వివరాల కోసం www.telanganaset.org చూడగలరు.
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET) – 2026 నోటిఫికేషన్ విడుదల







