దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్, ఇతర జాతీయ కంపెనీల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బీ , గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ రిక్రూట్మెంట్ పరీక్షకు (CRE – 5) నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య 1,484. రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నిషియన్, మెకానిక్, సీఎస్ఎస్ డీ టెక్నిషియన్, అటెండెంట్, ఓటీ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్, డెంటల్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, క్యాషియర్, స్థాఫ్ నర్స్, టెక్నిషియన్, డైటిషియన్, అసిస్టెంట్ డైటిషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, టెక్నిషియన్ పోస్టులు భర్తీ చేయనుంది. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ, డిప్లొమా, ఇన్ ఫార్మసీ, పీజీ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సి, ఎస్టీలకు ఐదేళ్ళు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ. 3000. ఎస్సీ, ఎస్టీ ,పీడబ్ల్యూబీడీలకు రూ. 2400. దివ్యాంగులకు ఫీజు లేదు. దరఖాస్తుకు చివరి తేది జులై 3. పరీక్షలు జులై 25 తేదీ నుంచి 27 వరకు ఉంటాయి. పూర్తి వివరాలకు https://rrp. aiimsexams. ac. in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.
నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీ







