రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) – నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 2,008 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 2,008.
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, పెయింటర్, మెషినిస్ట్ తదితరాలు.
అర్హత: కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI (NCVT/SCVT) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 06.11.2026 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి (SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBCకి 3 ఏళ్ల సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం: 10వ తరగతి, ITI మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ. 100 (SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది).
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 07.10.2026
చివరి తేదీ: 06.11.2026
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2,008 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు







