తెలంగాణలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ ‘స్పెషల్ TG-TET 2026-II’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు (ప్రమోషన్లు) మరియు ఉద్యోగ భద్రతకు ఈ పరీక్ష అత్యంత కీలకమైనదని విద్యాశాఖ పేర్కొంది. అర్హులైన ఉపాధ్యాయులు అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 16 వరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను నవంబర్ 16 నుంచి నవంబర్ 21 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అర్హత కలిగిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులందరూ గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టీజీ ఇన్-సర్వీస్ టెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం







