Trending Posts

నిరంకారీ రాజమాత స్కాలర్‌షిప్ స్కీమ్ 2026-27 ఏటా రూ.75,000 వరకు ఫీజు మినహాయింపు

​సంత నిరంకారీ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రజ్ఞావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ‘నిరంకారీ రాజమాత స్కాలర్‌షిప్ స్కీమ్ 2026-27’ను ప్రకటించింది. అండర్‌గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులు అభ్యసిస్తున్న అభ్యర్థులు దీనికి అర్హులు.
​కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో రెగ్యులర్‌గా చదువుతుండాలి.
​పోటీ రాత పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్, MBA/PGDM, ఆర్కిటెక్చర్, CA, CFA, LLB, జర్నలిజం వంటి కోర్సులలో ప్రవేశం పొంది ఉండాలి. ఇంటర్మీడియట్/12వ తరగతిలో కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలి. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి గరిష్టంగా రూ.75,000 వరకు పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
​చివరి తేదీ: 30 నవంబర్ 2026
​వెబ్‌సైట్: www.b4s.in/yeks/NRS8

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/