ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భర్తీ చేయనున్న గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 27 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ (DSP) సహా మొత్తం 163 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 41 సహాయ ఇంజనీర్ పోస్టులు, 378 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు మరియు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సర్వీసెస్‌లో 8 అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు కూడా నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు
గ్రూప్-1 నోటిఫికేషన్.. నేటి నుంచే దరఖాస్తులు ప్రారంభం








