2027 ఏడాదికి సంబంధించిన పరీక్షల క్యాలెండర్ ను UPSC విడుదల చేసింది. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. సివిల్ సర్వీసెస్ 2027 పిలిమినరీ పరీక్ష 2027 మే 23న జరగనున్న నేపథ్యంలో 2027 జనవరి 13 నుంచి ఫిబ్రవరి రెండు వరకు యూపీఎస్సీ దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రధాన పరీక్షలు అదే ఏడాది ఆగస్టు 20 నుంచి జరగనున్నాయి. ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలకు వచ్చే సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 6 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. పిలిమినరీ వచ్చే ఏడాది జనవరి 31న, ప్రధాన పరీక్షలు జూన్ 18న నిర్వహించేందుకు యూపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. యూపీఎస్సీ నిర్వహించే ఇతర పరీక్షలకు సంబంధించిన క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ అంశాలను గమనించాలని సూచించింది.
పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన UPSC







