భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL) బెంగళూరు, తాత్కాలిక పద్ధతిన నాలుగు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనుంది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. బి.ఈ, బీటెక్, బిఎస్సి తోపాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థి వయసు 32 ఏళ్లు మించి ఉండరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంది. ఎంపికైన అభ్యర్థులకు వేతనం 40 వేల నుంచి 55 వేల వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 472 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్టి, ఎస్సీ, వికలాంగులకు ఫీజు లేదు. జూన్ 16వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవాల్సిన పోస్ట్ చిరునామా.. ద డిప్యూటీ మేనేజర్ ( హెచ్ఆర్/ ఎస్సీ అండ్ యూఎస్ ఎస్ బి యు), భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్, జలహళ్లి పోస్ట్, బెంగళూరు – 560013, పూర్తి వివరాలకు bel-india.in వెబ్సైట్ ను సంప్రదించండి.
భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL) లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు







