Trending Posts

హెల్త్‌కేర్ రంగంలో టెక్నాలజీ హవా కొత్త కెరీర్ అవకాశాలకు భారీ డిమాండ్

​దేశంలో హెల్త్‌కేర్ రంగం శరవేగంగా విస్తరిస్తోందని, పరిశోధనల (R&D) నుంచి క్షేత్రస్థాయి పేషెంట్ కేర్ వరకు లక్షలాది ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రెండేళ్లలో దాదాపు 32 లక్షల మంది హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేస్తోంది.
​హెల్త్‌కేర్ అంటే కేవలం డాక్టర్లు మాత్రమే కాకుండా నర్సింగ్, ఫార్మసీ, బయోటెక్, క్లినికల్ రీసెర్చ్, మెడ్ టెక్ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హెల్త్ కేర్ డేటా అనాలిసిస్, టెలి మెడిసిన్ మరియు AI అసిస్ట్ డయాగ్నోసిస్ వంటి సాంకేతికతల ప్రవేశంతో ఇప్పుడు హెల్త్‌కేర్ రంగంలో ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, బయోమెడికల్ నిపుణుల అవసరం కూడా ఎంతగానో పెరిగింది.
​అయితే, ల్యాబ్ పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా మార్కెట్‌లోకి రావడానికి తగిన తయారీ యూనిట్లు, సరళీకృత ప్రభుత్వ విధానాలు మరియు పేటెంట్ నిబంధనలు అవసరం. అకాడమిక్, ఇండస్ట్రీ వర్గాల భాగస్వామ్యం (Collaborations) ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
​యువత కేవలం సాంప్రదాయ డిగ్రీలకే పరిమితం కాకుండా ఇండస్ట్రీ డిమాండ్ చేసే నైపుణ్యాలు (Job-ready skills), ప్రాక్టికల్ ప్రాజెక్ట్‌లు, బయో ఇన్ఫర్మాటిక్స్ మరియు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా రియల్ టైమ్ స్కిల్స్ పెంచుకుంటే అద్భుతమైన కెరీర్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/