Trending Posts

10,060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేసింది. నాలుగు దశల్లో వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
​ఇందులో గ్రూప్-1 (149), గ్రూప్-2 (673), విద్యాశాఖ/డీఎస్సీ (2,995 టీచర్ పోస్టులు)తో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.
​దశలవారీగా నోటిఫికేషన్ల వివరాలు:
​తొలి దశ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 1,523 పోస్టులకు మే 15నే నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ ప్రారంభించారు.
​రెండో దశ సెప్టెంబర్ 15న 3,231 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానుంది. దీని ద్వారా గ్రూప్-1, పోలీస్, అటవీ, పశుసంవర్ధక శాఖల్లో ఖాళీలు భర్తీ అవుతాయి.
​మూడో దశ అక్టోబర్ 15న 2,311 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో గ్రూప్-2, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ పోస్టులు ఉంటాయి.
​నాలుగో దశ అక్టోబర్ 15న 2,995 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/