ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో 1 : 3 చొప్పున అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు మే 22, 23 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనుంది. అయితే ఈ తేదీల్లో హాజరు కానీ వారు మే 25వ తేదీన కూడా హాజరయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మెడికల్ కాలేజీల్లో 34 డిపార్ట్మెంట్లలో 607 పోస్టుల భర్తీకి ఏడాది క్రితమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసింది. అయితే నాలుగు డిపార్ట్మెంట్లలోని 174 పోస్టులను ఇప్పటికే భర్తీ చేసింది. ఎంపికైన వారు ఇప్పటికే విధుల్లో చేరారు. మిగిలిన 30 డిపార్ట్మెంట్లలోని 43 పోస్టుల కు సంబంధించిన లిస్టును ఇప్పుడు విడుదల చేసింది. వీరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎంపికైన డాక్టర్ల లిస్టును ప్రకటించనుంది. ఈ నియమకాలు పూర్తి అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది.
మెడికల్ కాలేజీలోపోస్టుల భర్తీలో మెరిట్ లిస్ట్ విడుదల







