ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగ నియామకాలు వయోపరిమితిని పెంచింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా నిర్ణయించింది. అయితే యూనిఫాం సర్వీసులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో గత ప్రభుత్వం మొదట 10 ఏండ్లు సడలించింది. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించారు. ఇప్పటి ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగం కోసం వేచి చూస్తూ.. వయసు పరిమితి దాటిపోయిందని ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు
ప్రభుత్వ నిర్ణయం శుభవార్తగా చెప్పవచ్చు.
నిరుద్యోగులకు తీపి కబురు వయోపరిమితి పెరిగిందోచ్







