Trending Posts

దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారా.. మికే సదవకాశం

యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ , నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2026 రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆర్మీ వింగ్లో 208 ( 198 పురుషులు, 10 మహిళలు), నేవీ వింగ్ లో 42 పోస్టులకు గాను )పురుషులు 37, మహిళలు 5), ఎయిర్ ఫోర్స్ వింగులో 120 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఫ్లయింగ్ బ్రాంచ్ 92, గ్రౌండ్ డ్యూటీలు( టెక్) 18, గ్రౌండ్ డ్యూటీలు ( నాన్ టెక్) 10 పోస్టులు ఉన్నాయి. ఇక నావల్ అకాడమీలో 24 పోస్టులు ఉన్నాయి. ఆర్మీ వింగ్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 కాండేట్ ఎంట్రీ స్కీం ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ తో పాటు ఇంటర్ కలిగి ఉండాలి. అలాగే శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థులు 1 జనవరి 2008 కి ముందు, 1 జనవరి 2011 తర్వాత పుట్టి ఉండకూడదు. అభ్యర్థుల ఎంపిక విధానం రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, ఇంటలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్, ఎస్ ఎస్ బి టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష రెండు పేపర్లు ఉంటాయి. 900 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలెక్షన్ బోర్డు ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికి కూడా 900 మార్కులు కేటాయించారు. అనంతరం గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అన్నిట్లో మెరిట్ బట్టి అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.

కోర్సులు :
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నెవెల్ అకాడమీ , ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవి 10+2 బీటెక్ కాండేట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు అర్హత సాధిస్తారు. ఎంపికైన వారు బిఎ, బీఎస్సీ, బీటె క్ కోర్సుల్లో చదువుకోవచ్చు. తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో శిక్షణ పొందుతారు. అనంతరం వీరిని ట్రేడ్ శిక్షణకు పంపుతారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి. అభ్యర్థులు upsconline.nic.in /login లో మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు కు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ , మహిళలకు ఉచితం. మే 20వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 13వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. 01 జూలై 2027 నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/