Trending Posts

వేసవి సెలవులు పొడగింపు

ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం 12వ తేదీ ( శుక్రవారం) నుంచి స్కూల్స్ ప్రారంభం కావలసి ఉంది. అయితే 13వ తేదీ రెండవ శనివారం, 14వ తేదీ ఆదివారం వరసగా రావడంతో సెలవులను పొడిగించింది. దాంతోపాటు వేసవి నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉండటంతో కూడా సెలవులను పొడిగించింది. జూన్ 15వ తేదీ వరకు ఈ సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 15వ తేదీ ( సోమవారం) యధావిధిగా పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ఎండల తీవ్రత నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే స్కూల్ ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల్లో కావలసిన పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు చేర్చింది. ఎంఈఓ లు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు పంపిణీ సైతం చేస్తున్నారు. స్కూల్ యూనిఫామ్స్ కూడా సిద్ధం చేశారు. పలుచోట్ల బడిబాట సైతం కొనసాగుతుంది. అయితే వివిధ కారణాలతో జూన్ 15 వరకు సెలవులు పెంచుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/