Trending Posts

DRDO లో ఉద్యోగాలు


భారత రక్షణ శాఖకు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ( DRDO) లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. అనుభవజ్ఞులైన సైన్స్, ఇంజనీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. వివిధ గ్రేట్ల సైంటిస్ట్ పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం 33 రెగ్యులర్ సైంటిస్ట్ పోర్తులు భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 67,700 నుంచి రూ. 1,23, 100 వరకు వేతనం ఇవ్వనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ( ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఏరోస్పే స్, కెమికల్ ఇంజనీరింగ్ , ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్) కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ పాసై ఉండాలి. గరిష్ట వయసుకు 45 ఏళ్లు మించి ఉండరాదు. అభ్యర్థుల దరఖాస్తులను అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం షార్ట్ లిస్ట్ చేసిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం తుది జాబితాను వెల్లడిస్తారు. దరఖాస్తు ఫీజు ₹100గా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ, వికలాంగులకు, మహిళలకు ఫీజు లేదు. 2026 జూన్ 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు rac.gov.in వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/