లాబోరేటరీ ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ లో 75 ఇంటర్న్ షిప్పుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 35, మెకానికల్ ఇంజనీరింగ్ /ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 10, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 20, సివిల్ ఇంజనీరింగ్ 2, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ 8 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కోర్స్ వ్యవధి 6 నెలలు ఉంటుంది. బీఈ, బీటెక్, ఎమ్మెస్సి చివరి సంవత్సరం చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెలకు రూ. 5,000 స్టైఫండ్ వస్తుంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జులై 1,2026.
అడ్రస్: డైరెక్టర్, ల్యాబోరేటరీ ఎలక్ట్రానిక్స్ అండ్ రాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్(ఎల్ ఆర్ డీ ఈ ), డిఫెన్స్ ఆర్ అండ్ డీ ఆర్గనైజషన్, సీవీ రామన్ నగర్, బెంగళూరు – 560093.
పూర్తి సమాచారం కోసం http://www. drdo. gov. in వెబ్ సైట్ ను సంప్రదించండి.
ఎల్ ఆర్ డీ ఈ..బెంగుళూరు..







