Trending Posts

బీఈఎంఎల్ లో 362 ఆపరేటర్ పోస్టుల భర్తీ

బీఈఎంఎల్ లో 362 ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. (ఐటిఐ-ఫిట్టర్)-127, టర్నల్-93, వెల్డర్-44, మెషినిస్ట్-40, ఎలక్ట్రీషియన్-58 ఖాళీలు ఉన్నాయి.
ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ట్రేడులో ఐటీఐతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది జులై 10. వయసు ఈడబ్ల్యూఎస్, జనరల్ లకు 29 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది. నెలకు రూ. 16,900 జీతంతో పాటు వైద్య ఖర్చులకు నెలకు రూ. 1500 చెల్లిస్తారు. షార్ట్ లిస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రెండు గంటల పాటు జరిగే ఈ పరీక్షలో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్క్స్ లేవు. ఈ పరీక్షల్లో జనరల్ అభ్యర్థులకు 45 శాతం, ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. దరఖాస్తుకు సంబంధించిన వివరాలు https://www. bemlindia. in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/