కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) పరిధిలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (BSF, CRPF, ITBP, SSB), అస్సాం రైఫిల్స్‌లో మెడికల్ ఆఫీసర్ క్యాడర్ పోస్టుల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
మెడికల్ ఆఫీసర్: 115
సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్: 05
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్): 162
విభాగాలు & అర్హతలు:
మెడిసిన్, సర్జరీ, గైానకాలజీ, అనస్థీషియా, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS, MD, MS, లేదా DNB పూర్తి చేసి, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగిన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉండాలి.
వేతనం & ఎంపిక విధానం:
పోస్టును బట్టి నెలకు ₹56,100 నుండి ₹2,09,200 వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. ఇంటర్వ్యూ (200 మార్కులు), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు వివరాలు:
జనరల్, OBC, EWS కేటగిరీ పురుష అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ₹400. SC, ST, మహిళలు మరియు మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 10, 2026
చివరి తేదీ: సెప్టెంబరు 08, 2026
సీఏపీఎఫ్లో 282 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్







