Trending Posts

సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ కోర్సులో ప్రవేశాలు

ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ టూల్ రూమ్ హైదరాబాద్‌లోని ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్’ (సీఐటీడీ) 2026 విద్యా సంవత్సరానికి గాను ఎంఈ (మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల అయింది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో అందిస్తున్న ఈ రెండేళ్ల (4 సెమిస్టర్లు) ఫుల్‌టైమ్ ఎంఈ (టూల్ డిజైన్) కోర్సు ద్వారా టూల్ డిజైన్, తయారీ, ఇంజనీరింగ్‌ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 55% మార్కులతో బీఈ/బీటెక్ (మెకానికల్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ​వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1,500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.750. ఉంటుంది. సీఐటీడీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. గేట్ ర్యాంకర్లు కూడా ఈ పరీక్షలో అర్హత సాధించాల్సిందే. పరీక్ష 1 గంట పాటు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో హైదరాబాద్‌లోని సెంటర్‌లో జరుగుతుంది. ప్రవేశ పరీక్ష మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.
​దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. ​దరఖాస్తుకు చివరి తేదీ: 26-08-2026, ప్రవేశ పరీక్ష తేదీ: 02-09-2026 నిర్వహిస్తారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/