Trending Posts

బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాల భర్తీ: దరఖాస్తుకు రేపే చివరి తేదీ!

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 11,403 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు రేపే (ఆగస్టు 21) చివరి తేదీ. ఉద్యోగార్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. దేశవ్యాప్తంగా 11,403 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 186, తెలంగాణలో 191 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
​ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
​వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
​ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు లోకల్ లాంగ్వేజ్ (స్థానిక భాషా) టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుంది.
​నెలకు రూ. 24,000 నుండి రూ. 64,000 వరకు జీతం ఉంటుంది.
​చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున, అర్హత కలిగిన అభ్యర్థులు సమయం వృథా చేయకుండా వెంటనే అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in ద్వారా తమ దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తుకు సంభందించిన పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/