భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML Limited), బెంగళూరు కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 2026 సెప్టెంబరు 8 వరకు అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
మొత్తం 1,346 పోస్టులు ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, మోటార్ వెహికిల్ మెకానిక్ మొదలైనవి.
వయస్సు కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్ (నెలకు): గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 12,300; డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ. 10,900; ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ. 9,600 నుంచి రూ. 10,560 వరకు అందుతుంది.
మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 8, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
BEML లో 1,346 అప్రెంటిస్ పోస్టులు: నోటిఫికేషన్ విడుదల







