నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దిల్లీ (NIT) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
పోస్టుల వివరాలు మొత్తం ఖాళీలు: 08
ప్రాజెక్ట్ అసోసియేట్ (సివిల్) – 03
ప్రాజెక్ట్ అసోసియేట్ (ఎలక్ట్రికల్) – 01
జూనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ – 01
ప్రాజెక్ట్ అటెండెంట్ – 02
ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (సివిల్) – 01
అర్హతలు పోస్టును అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, బీటెక్ లేదా ఎమ్టెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
వయస్సు గరిష్ఠంగా 65 ఏళ్లు మించకూడదు.
ప్రాజెక్ట్ కన్సల్టెంట్కి రూ. 55,000; ప్రాజెక్ట్ అసోసియేట్కి రూ. 37,000; జూనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ & ప్రాజెక్ట్ అటెండెంట్లకు రూ. 32,800 జీతం చెల్లిస్తారు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా ajay@nitdelhi.ac.in కు దరఖాస్తులు పంపాలి.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 03, 2026 న ఉంటుంది.
ఎన్ఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టుల భర్తీ







