Trending Posts

కోటక్ మహీంద్రా బ్యాంక్ స్కాలర్‌షిప్ 2026 ప్రకటన: చివరి తేదీ అక్టోబరు 15

కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఎస్ఆర్ (CSR) ప్రాజెక్టులో భాగంగా విద్యార్థినుల ఉన్నత చదువులకు మద్దతుగా ‘కోటక్ కన్యా స్కాలర్‌షిప్-2026’ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
​స్కాలర్‌షిప్ వివరాలు:
​మొత్తం: ఏటా రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం.
​ప్రయోజనం: కాలేజీ ఫీజు, ఇంటర్నెట్, రవాణా, ల్యాప్‌టాప్, బుక్స్, స్టేషనరీ ఖర్చులకు ఉపయోగించవచ్చు.
​అర్హతలు:
​ఇంటర్ పూర్తి చేసి 2026-27 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, డిజైన్, ఎల్‌ఎల్‌బీ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరిన విద్యార్థినులు అర్హులు.
​ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు లేదా సమానమైన సీజీపీఏ సాధించాలి.
​కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
​ఇంటర్ తర్వాత గరిష్ఠంగా ఒక సంవత్సరం గ్యాప్ వరకు మాత్రమే అనుమతిస్తారు.
​ఎంపిక & దరఖాస్తు విధానం:
అకడమిక్ మెరిట్, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల ఇంటర్వ్యూల ద్వారా ర్యాంకులు కేటాయించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి స్కాలర్‌షిప్ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
​దరఖాస్తు విధానం: అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
​చివరి తేదీ: 2026 అక్టోబరు 15 వరకు చేసుకోవచ్చు

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/