భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కి చెందిన బెంగళూరులోని యు.ఆర్. రావు షాటిలైట్ సెంటర్ (URSC) 2026-27 సంవత్సరానికి గానూ 410 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బీఈ/బీటెక్): 220
టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): 120
కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్: 70
విభాగాల వారీగా:
కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఆటోమోబైల్, ఏరోనాటికల్ మొదలైన ఇంజినీరింగ్ మరియు డిప్లొమా విభాగాలు.
అర్హత & వేతనం:
సంబంధిత విభాగాల్లో 2022 నుండి 2026 మధ్య బీఈ/బీటెక్ లేదా డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులు (2021 కంటే ముందు ఉత్తీర్ణులైనవారు అనర్హులు).
నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.12,300, టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.10,900 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.
ఎంపిక & దరఖాస్తు విధానం:
అభ్యర్థులను మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్‌లో నమోదు చేసుకుని, అనంతరం UMANG యాప్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.07.2026
చివరి తేదీ: 28.08.2026
ఇస్రో షాటిలైట్ సెంటర్లో 410 అప్రెంటిస్ పోస్టులు: ఆగస్టు 28 ఆఖరి తేదీ










